“ఆత్మనిర్భర్ భారత్ మనకు కొత్త విషయం కాదు. ప్రాచీన భారతదేశం పూర్తి స్వావలంబనతో ప్రపంచానికి వ్యాపార కేంద్రంగా ఉండింది. వారి సామర్థ్యాలు మరియు నైపుణ్యాలపై పూర్తి విశ్వాసం ఉన్న 130కోట్ల మంది భారతీయుల వ్యక్తీకరణ ఇది”.
మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు, స్వయంప్రతిపత్త సంస్థలకు రూ.2 లక్షల కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలు బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి మేము నిర్దిష్ట విధానాలను రూపొందిస్తాము.
2021-22 సంవత్సరానికి, మూలధన వ్యయంలో తీవ్ర పెరుగుదలను ప్రతిపాదిస్తూ రూ.5.54 లక్షల కోట్లు అందిస్తున్నాము, ఇది 2020-21 యొక్క BE కంటే 34.54% ఎక్కువ.
మార్చి 2022 నాటికి, మేము సుమారు 8,500 km రహదారులను పూర్తి చేస్తాము మరియు అదనంగా 11,000 కిలోమీటర్ల NH కారిడార్లను అందిస్తాము.
రహదార్ల మౌలిక సదుపాయాలను మరింత పెంచడానికి, మరిన్ని ఆర్థిక కారిడార్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.
రైల్వేలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి, భారతీయ రైల్వే యొక్క అధిక సాంద్రత గల నెట్‌వర్క్ & అధికంగా వినియోగించిన నెట్‌వర్క్ మార్గాలకు దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ, మానవ లోపం కారణంగా జరిగే రైలు ప్రమాదాలను అరికడుతుంది.
2 కొత్త సాంకేతిక పరిజ్ఞానాతో – మెట్రో లైట్ మరియు మెట్రో నియో – టైర్ II నగరాల్లో మరియు టైర్ I నగరాల చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అదే అనుభవం, సౌలభ్యం మరియు భద్రతతో మెట్రో సేవలను తక్కువ ఖర్చుతో అందించనున్నాo. పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం మాత్రమే కలిగిన 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది.
NEP యొక్క అన్ని భాగాలకు అనుగుణంగా 15,000 పాఠశాలలు బలోపేతం చేయబడతాయి. వారు తమ ప్రాంతాలలో ఇతర పాఠశాలలకు ఉదాహరణలుగా ఉద్భవించాలి.
అసంఘటిత రంగ కార్మికుల, భవన మరియు నిర్మాణ కార్మికుల సంబంధిత సమాచారాన్ని సేకరించే పోర్టల్‌ను ప్రారంభించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. వలస కార్మికులందరికీ ఆరోగ్యం, గృహ నైపుణ్యం, బీమా క్రెడిట్ & ఇతర పథకాలను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది.
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈసారి పిఎస్‌ఎల్‌వి-సిఎస్ 51 ను లాంచ్ చేయనుంది.‘గగన్ యాన్’ మిషన్ యొక్క మొదటి మానవరహిత ప్రయోగం ఈ సంవత్సరం డిసెంబర్లో జరుగుతుంది.