
మాక్లూర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నాం. ప్రభుత్వం వారిని ఎలా ఇబ్బందులకు గురి చేస్తుందో రైతులు తెలియజేసారు

రైస్ మిల్లర్ల సంఘాలు (తెరాస వర్గం) మరియు అధికారులు కుమ్మక్కై, మిల్లర్లకు వచ్చే తౌడు, నూక, నూనె తదితర వస్తువులపై వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి తాలు, తేమ పేరుతో రైతులపై ఆ భారాన్ని వేస్తున్నారు.
ఇదే విషయమై రెండు జిల్లాల కలెక్టర్ లతో మాట్లాడి, ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను.
ఈ మోసాన్ని ఎక్కడెక్కడ, ఎవరెవరికి తెలిపితే న్యాయం జరుగుతుందో ఆ చోట్ల కూడా సమాచారం అందజేసాను.

ఎట్టిపరిస్థితుల్లో రైతులు ఈ తరుగుకి, మోసానికి ఒప్పుకోవద్దు.
తాలు, తేమ పేరుతో ధాన్యంలో తరుగు తీయడం అన్యాయం..
కేవలం తెరాస నాయకులు, కొంతమంది రైస్ మిల్లర్లు, అధికారుల ధన దాహంతో రైతుల పొట్టకొడుతున్నరు..
ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేస్తున్నపుడు, ఎందుకిలా దోచుక తింటున్నారు?
Leave a Reply