ఒడిశాలో వెనుకబడిన నువాపడ జిల్లాకు చెందిన నవీన్ ఠాకూర్ అనే రైతు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ గారితో సంభాషించే అవకాశం పొందారు.
కిసాన్ క్రెడిట్ కార్డుని(KCC) స్వీకరించి ఉపయోగించారా అని మోడీ గారు ఠాకూర్‌ను అడగగా, దానికి ఆయన, “నేను గత సంవత్సరం కార్డు అందుకున్నాను మరియు 4% వడ్డీకి లోన్ తీసుకున్నాను. ఇంతకుముందు, నేను వడ్డీవ్యాపారుల నుండి 20% వడ్డీకి రుణాలు తీసుకోవలసి వచ్చింది, కాని ఇప్పుడు నేను విత్తనాలు, ఎరువులు & పురుగుమందులను కొనడానికి ఇంత తక్కువ రేటుకు ఆర్ధిక సహాయం పొందగలిగాను. దీనికి నేను మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ”అని ఠాకూర్ ప్రధానితో అన్నారు.