రైతులను మక్క ఏయొదన్నది నువ్వు, మళ్ల దిగుమతి చేయమన్నది నువ్వు, దిగుమతి చేశినంక ఎందుకు చేసిర్రంటుంది నువ్వే.. నీ పింక్ మీడియాతో ఎన్ని పుంగీలు ఊదినా, రైతులకు నీ దిక్కుమాలిన రాజకీయం అర్ధం అయితలేదనుకున్నావా??
పోయిన సంవత్సరంతో పోలిస్తే 18 లక్షల మెట్రిక్ టన్నుల తక్కువ మక్క దిగుబడి దేశంలో వచ్చింది(వీడియోలో పొరపాటున 12 లక్షలు అనడం జరిగింది). అదనంగా, పోయిన ఏడాది 3 రాష్ట్రాల్లో అకాల వర్షాల వళ్ళ మక్క పంట నాశనమయ్యింది. అందుకే ముందు చూపుతో, పౌల్ట్రీ, పశు దాన, బయో ఫ్యూయల్, స్టార్చ్ పరిశ్రమలకు కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం కొంత మక్కని దిగుబడి చేసుకుంది.