Published On 9 Jan, 2022
ప్రభుత్వ ఉద్యోగి ఉసురు తీసిన 317 జీవో : Dharmapuri Arvind

ఇది కెసిఆర్ చేసిన హత్య!

ప్రభుత్వ ఉద్యోగి ఉసురు తీసిన 317 జీవో..

భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో బేతల సరస్వతి(36) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

317 జీవో తో కామారెడ్డి కి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడి.

మరణించిన సరస్వతి గారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితిని తలుచుకుంటే వేదనతో పాటు ఆగ్రహం కలుగుతోంది.

సరైన సంప్రదింపులు చేయకుండా, విధి విధానాలు తెలుపకుండా ఉద్యోగులను అయోమయంలో పడేసి, వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ, ప్రాణాలు తీసుకునే స్థితికి నెట్టుతున్న ఈ GO ని తక్షణమే వెనక్కి తీసుకొని ఉద్యోగులు సూచించిన సవరణలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నం.

KCR ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న అమానవీయమైన ఈ తీరుని BJP పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను.

GO వెనక్కి తీసుకొని, సవరణలు చేపట్టకపోతే ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుంది.

*** ప్రభుత్వ ఉద్యోగస్థులెవరూ మనోబలం కోల్పోకూడదని మనవి చేస్తున్నాను. మీ తరపున ఆఖరి వరకు BJP పోరాటం చేస్తుంది 🙏***

Latest News - Dharmapuri Arvind

Related Posts

English English తెలుగు తెలుగు