గిరిజనుల అభివృద్ధి కోసం నిజామాబాద్ ను ఐటీడీఏ సబ్ డివిజన్ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా గారిని కలిసి కోరడమైనది. దానికి వారు అనుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన యొక్క కార్యాలయంలో కలిసి పార్లమెంట్ పరిధిలో ఉన్న గిరిజనుల యొక్క పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాను. నిజామాబాద్ జిల్లాలో సుమారు 250 వరకు తాండాలు ఉన్నాయని, అందులో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 1,21,707 ఉందని, ఇక్కడి గిరిజన ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారని, వీరంతా వ్యవసాయాధార, సాంప్రదాయాల పైన ఆధారపడి ఉన్నారని వివరించాను. అంతేకాకుండా తండాల్లో పంచాయతీ భవనాలు, మహిళా భవన్లు, అంగన్వాడి సెంటర్ లో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం లేవని, ఇక్కడ సమీప మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి రోడ్ల పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని వివరిస్తూ, నిజామాబాద్ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సబ్ డివిజన్ కేంద్రం గా ప్రకటించి, మౌలిక సదుపాయాల కొరకు ప్రతీ గ్రామ పంచాయతీకి 50 లక్షల నిధులు విడుదల చేసి, ఇక్కడి గిరిజన ప్రాంత ప్రజల జీవనాభివృద్ధికి సహకరించాలని కోరాను .