స్పైసెస్ బోర్డు, రీజనల్ ఆఫీస్ కం ఎక్స్ టెన్షన్ సెంటర్, నిజామాబాద్, సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, వరంగల్, డివిజనల్ ఆఫీస్, హైదరాబాద్ మరియు తెలంగాణ రీజనల్ ఆఫీస్, నాబార్డ్ కలిసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలు “సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రారంభించడం” కోసం వెబ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు వివిధ సంస్థలకు చెందిన 36 మంది ప్రతినిధులు, సుమారు 1500 మంది పసుపు, మిర్చి రైతులకీ ప్రాతినిధ్యం వహిస్తున్న FPO లు తెలుగు రాష్ట్రాల నుండి ఈ వెబినార్ లో పాల్గొన్నారు.