పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కోరడం జరిగింది.
ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయి, పార్లమెంట్ పరిధిలో రైల్వేలకి సంబంధించి, పెండింగ్ లో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను.
వారానికి ఒకసారి నడిచే కాజిపేట్ – దాదర్ రైలుని అత్యంత త్వరగా నడిపి, వారానికి మూడుసార్లు నడిచేలా చేయాలని కోరగా, అతి కొద్ది రోజుల్లో రైలు నడిచేలా తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అవసరమైన చోట్ల కొత్త ఆర్ఓబీలు, ఆర్ యూబీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని , రైల్వే లైన్ల మంజూరు చర్యలను వేగవంతం చేయాలని, పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్ళాను.
పై విజ్ఞప్తుల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించి, తగు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిపారు…అందుకు వారికి ధన్యవాదములు తెలుపుతున్నాను!