ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముత్యంపేటచెరుకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రైతులంతా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చెరుకు ఫ్యాక్టరీ సాధన కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, రైతు ఐక్యవేదిక అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి, దొడ బాపురెడ్డి, కర్నె రాజేందర్ రెడ్డి, మిట్టపెల్లి తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, బీజేపీ సారంగాపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, బీజేవైయం మండల అధ్యక్షుడు దీటి వెంకటేష్, జగిత్యాల పట్టణ, మెట్ పల్లి మండలాల కిసాన్ మోర్చా అధ్యక్షులు ముద్దం రాములు, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.