నిజామాబాద్ నగరంలోని భర్కత్ పుర కాలనీలోని ఎంఐఏం నేత ఇంటిపై బుదవారం తెల్లవారు జామున టాస్క్ పోర్స్ పోలిసులు దాడి నిర్వహించారు.
సిపి కార్తీకేయ గారి అదేశాల మేరకు సిఐ షాకీర్ ఆలీ, తన సిబ్బందితో కలిసి ఎంఐఏం నేత, వక్ప్ బోర్డు వైస్ చైర్మెన్ ఎన్ఆర్ఐ జావిద్ ఇంటిపై దాడి చేసి సుమారు 12 లక్షల విలువైన గుట్కాను స్వాధినం చేసుకున్నారు.
ఈ మేరకు జావీద్ పై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన గుట్కాను రెండవ టౌన్ పోలిస్ లకు అప్పగించారు.