Published On 24 Jun, 2021
స్కోలియోసిస్ వ్యాధితో బాధ పడుతున్న మేఘన అనే బాలికకు ఉచితంగా వైద్యం చేయించాం: Dharmapuri Arvind
dharmapuri arvind bjp

స్కోలియోసిస్ (వెన్నెముక ఒకవైపుకి వంగడం) వ్యాధితో బాధ పడుతున్న, కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన మేఘన అనే బాలిక వైద్యానికి లక్షలు ఖర్చు అవుతుందని, అమ్మాయిది చాలా పేద కుటుంబమని, అంత ఖర్చు భరించే ఆర్థిక స్తోమత లేదని స్థానిక నాయకుల ద్వారా తెలిసింది. ఈ పాపకి నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి, దాదాపు ₹6.5 లక్షలు విలువ చేసే వైద్యాన్ని, Dr.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి చొరవతో ఉచితంగా వైద్యం చేయించాం. మేఘన ప్రస్తుతం కోలుకోవడంతో, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్లి తన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

Related Posts