సోషల్ మీడియాలో ఒకసారి హుజురాబాద్ లో బీజేపీ గెలవగానే హుజురాబాద్ ముస్లింలను మా చెప్పులతో తొక్కి పెడతామని, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యలు చేసినట్లుగా, అట్టి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇంచార్జ్ పరుచూరి జయంత్ రావు కరీంనగర్ 2 టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక పేరిట ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించి మతవిద్వేషాలు కలిగించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. హుజురాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ తో గెలుస్తుందని, టిఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించి, మైనార్టీల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేయడమే కాక, మత కలహాలను సృష్టిస్తున్నారని భాజపా శ్రేణులు పేర్కొంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా దొడ్డిదారిలో గెలవాలని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం పట్ల మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి.
This day, 31 years ago
This day, 31 years ago in Lal Chowk in Srinagar - at the peak of terrorism - The tricolour hoisted by fearless souls…