మా జిల్లా లో రైతుల అనుభవం ఇదీ..మేం పండించిన పసుపు పంట అమ్మడానికి నిజామాబాద్ మార్కెట్ కు వెళ్ళేవాల్లం.. అక్కడి అడ్తిదారు కొందరు సేట్ లను తీసుకొచ్చి మా పసుపు కుప్పలు చూపెట్టేవారూ.. ఆ వ్యాపారులు కొన్ని కొమ్ములు పట్టుకొని కుప్పకు కొడుతూ, దంతెతోటి కుప్పను తోడుతూ ధర నిర్ణయించే వారు.. వ్యాపారులు కొన్ని కుప్పలు నాకూ కొన్ని కుప్పలు నీకూ అనే విధంగా సిండికేట్ అయ్యి ఎక్కువ ధర రాకుండా లాలూచి అయ్యేవారు.. ఇగ మేం మాత్రం ఇవన్నీ సూస్తూ నిలబడాలి, ధర ఎక్కువగా వచ్చిందంటే సంతోషపడాలీ రాకపోతే అన్నీ మూసుకొని వాళ్ళు చెప్పిన ధరకు ఇష్టం లేకున్నా ఇచ్చేయాలీ.. ఇదంతా పూర్తి కావాలంటే 2-3 రోజులు మార్కెట్లో నే ఉండాలీ.. రాత్రికి అడ్తిదారు రూంలో పడుకోవాలి అక్కడ సందు దొరుకకపోతే కుప్ప దగ్గరే బొంత సంచులలో కాళ్ళు పెట్టుకొని దుశాల మొఖం మీద యేస్కోని పడుకోవాలీ దోమల బాధ తప్పించుకోవడానికీ.. ఇగ వ్యాపారి చెప్పిన ధర నచ్చకపోతే ఇంకో 3-4 రోజులు అదే మార్కెట్ లో అలాగే ఉండిపోవాలీ… 10-15 సంవత్సరాల తరువాత కూడా అదే మార్కెట్ కు అదే రైతులు పసుపు పంటను అమ్మడానికి పోతున్నాం… కానీ అడ్తిదారు బలిసిపోయిండూ… ఇగ వ్యాపారీ వయసయిపోయీ కొడుకుకు అప్పజెప్పిండూ వ్యాపారం.. వ్యాపారుల కొడుకులేమో లక్షలూ, కోట్లు విలువ చేసే కార్లల్లో వస్తున్నారూ… మేం మాత్రం అదే ఆర్టీసీ బస్సులో మార్కెట్ కు వెళ్తున్నాం…
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి
Protests by Residents, Farmers, BJP & Unemployed youth in front of TRS leaders houses over unemployment allowance,...