భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త లింగం అనే వ్యక్తిని తన ఇంటికి వెళ్లి నిన్న రాత్రి 9:30 గంటలకు భీంగల్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.. ఆ విషయం తెలుసుకుని బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు వెంటనే స్పందించి భీంగల్ మండల అధ్యక్షుడుకి ఫోన్ చేసి అరెస్టుకు సంబంధించిన కారణాలను, తెలుసుకోమని కోరారు. పోలీస్ సిబ్బంది IT act సంబంధించిన కేసు, 15 నిమిషంలో విడుదల చేస్తామని మండల ప్రెసిడెంట్ కి చెప్పారు, కానీ ఇప్పటివరకు విడుదల చేయక పోవడంతో స్వయంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు భీంగల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి డ్యూటీ ఏఎస్ఐ ని వివరణ కోరగా అట్రాసిటీ కింద కేసు బుక్ చేసాము అని చెప్పారు, కేసు బుక్ చేసే ముందు తల్లిదండ్రులకు సెక్షన్ 41CRPC కింద నోటీసు ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ ఎలా చేశారు అని నిలదీశారు.
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం..
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం.. ఉద్యోగాల కోసం ఉద్యమించిన నిరుద్యోగ యువతకు స్వరాష్ట్రంలో అడుగడుగునా...