ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మరియు తైవాన్ వంటి చోట్ల యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌లతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించనున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి లిఖితపూర్వకంగా ప్రతిపాదన చేస్తానని చెప్పారు.
