ఈనెల 11వ తేదీన విడుదలైన హిందీ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ అద్భుతంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రశంసించారు. తాను కూడా కుటుంబ సభ్యులతో ఈ చిత్రాన్ని చూశానని ఆయన పేర్కొన్నారు. 1980లలో, 1990 జనవరి 19వ తేదీ నాడు మరియు ఆ తర్వాత కశ్మీరీ హిందువుల మీద ఏ రకమైన హింస జరిగిందో ఈ సినిమాలో చూయించారని, నిజాన్ని నిర్భయంగా చూపించిన దర్శకనిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలో భైంసా పట్టణం కూడా మరో కశ్మీర్ లా కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సుమారు 1500 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం నిజామాబాద్, ఆర్మూర్ మరియు జగిత్యాల పట్టణాల్లో రేపు మధ్యాహ్నం ప్రత్యేక షోలు వేస్తున్నామని, కార్యకర్తలందరూ ఈ సినిమాని చూడాలని, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతీ దేశభక్తుడు, హిందువు ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఆయన కోరారు.